'నా జీవితంలో అలాంటి ఆటగాడిని చూడలేదు'

Graeme Swann Praises Rahul Dravid Performance As Test Batsman - Sakshi

లండన్‌ : టీమిండియా మాజీ క్రికెటర్‌ రాహుల్ ద్రవిడ్ పై ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన జీవితంలో ద్రవిడ్​ను మించిన అత్యుత్తమ ఆటగాడిని చూడలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.' నా వరకు రాహుల్ ద్రవిడ్ అందరి కంటే గొప్ప బ్యాట్స్​మన్​. కౌంటీల్లో అతడికి నేను బౌలింగ్ చేశా. అతను ఒక అసాధారణంగా ఆటగాడు. అతడి కంటే అత్యుత్తమ బ్యాట్స్​మన్​ను నేను నా జీవితంలో చూడలేదు. ఓ కౌంటీ గేమ్​లో ద్రవిడ్‌ అసలు ఔటే కాలేదు.. అప్పుడు ద్రవిడ్‌ అంటే ఇదేనేమోనని అనిపించింది. అతడు బ్యాటింగ్ చేస్తుంటే నేను 11 ఏండ్ల స్పిన్నర్​లా ఫీలయ్యా. 2008లో చెన్నైలో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన నేను తొలి ఓవర్లోనే గంభీర్​తో పాటు ద్రవిడ్​ను కూడా ఔట్ చేశాను. ఆ విషయాన్ని ఇప్పటివరకు నేను మరిచిపోలేదు. నిజంగా అది అద్భుతమైన బంతేనని కానీ ద్రవిడ్​ను ఔట్ చేయగలిగినంత గొప్పది మాత్రం కాదని' గ్రేమ్​ స్వాన్ పేర్కొన్నాడు. మిస్టర్‌ డిపెండబుల్‌గా పేరు పొందిన ద్రవిడ్‌ తన కెరీర్​లో 163 టెస్టులు ఆడి13,265 పరుగులు, 344 వన్డేల్లో 10,889 పరుగులు సాధించాడు. ఎన్నోసార్లు ఆపదలో ఉన్న భారత జట్టును ఆదుకొని, పరాజయాల నుంచి తప్పించి 'ది వాల్​'గా పేరును దక్కించుకున్నాడు. 
(క్లాప్స్‌ కొట్టడానికి వీధుల్లోకి వస్తారా..?)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top