ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌ | German Open badminton | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్‌

Mar 3 2017 12:46 AM | Updated on Sep 5 2017 5:01 AM

ముల్హిమ్‌ ఎన్‌ డెర్‌ రుర్‌ (జర్మనీ): భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ జర్మన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌

జర్మన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

ముల్హిమ్‌ ఎన్‌ డెర్‌ రుర్‌ (జర్మనీ): భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ జర్మన్‌ ఓపెన్‌ గ్రాండ్‌ ప్రి గోల్డ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్లో 12వ సీడ్‌ శ్రీకాంత్‌ 21–17, 21–18తో యుసుకె ఒనొడెరా (జపాన్‌)పై విజయం సాధించాడు. శుక్రవారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో అతను... రెండో సీడ్‌ చెన్‌ లాంగ్‌ (చైనా)తో తలపడతాడు. ఒక్క శ్రీకాంత్‌ మినహా మిగిలిన భారత ఆటగాళ్లంతా రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement