ప్రిక్వార్టర్స్‌లో దేవీ సింగ్ | devisingh reached in pre-quarters | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో దేవీ సింగ్

Nov 29 2013 12:13 AM | Updated on Sep 2 2017 1:04 AM

ఆంధ్రకేసరి టైటిల్ కోసం జరుగుతున్న రాష్ట్ర ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 60 కేజీ విభాగంలో అంతర్జాతీయ రెజ్లర్ టి.దేవీసింగ్ (లాలా తలీమ్) ప్రిక్వార్టర్స్‌కు చేరాడు.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్రకేసరి టైటిల్ కోసం జరుగుతున్న రాష్ట్ర ఇండియన్ స్టయిల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 60 కేజీ విభాగంలో అంతర్జాతీయ రెజ్లర్ టి.దేవీసింగ్ (లాలా తలీమ్) ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. 84 కేజీ విభాగంలో జి.శ్రీనాథ్ యాదవ్ (అడవయ్య వస్తాదు) సెమీస్‌కు చేరాడు. ఎల్బీ స్టేడియంలో గురువారం ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగిన 60 కేజీ విభాగం మూడో రౌండ్‌లో టి.దేవీ సింగ్ తొలి రౌండ్‌లో తన ప్రత్యర్థి జగదీష్ (విజయనగరం)పై   బైఫౌల్‌తో విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. 84 కేజీ విభాగం క్వార్టర్ ఫైనల్లో జి.శ్రీనివాస్ యాదవ్ (హైదరాబాద్), శ్రీనివాస్ యాదవ్ (వరంగల్)పై విజయం సాధించాడు. ఈ పోటీలను సికింద్రాబాద్ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ హనుమంతరావు లాంఛనంగా ప్రారంభించారు.
 
  రెజ్లింగ్ పోటీలకు వర్షం దెబ్బ
  గురువారం రాత్రి భారీగా కురిసిన వర్షంతో పోటీలకు అంతరాయం కలిగింది. దీంతో విధి లేక ఈ పోటీలను నిర్వాహకులు వాయిదా వేశారు. భారీ సంఖ్యలో జంట నగరాల నుంచి తరలి వచ్చిన రెజ్లింగ్ క్రీడాభిమానులు నిరాశకు గురయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement