పెరూపై డెన్‌‘మార్క్‌’ 

Denmark Spoils Peru World Cup Return - Sakshi

 గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో 1 –0తో గెలుపు

సరాన్స్క్‌: ప్రపంచ కప్‌నకు 36 ఏళ్ల తర్వాత అర్హత సాధించిన పెరూ... డెన్మార్క్‌తో పోరాడి ఓడింది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో స్ట్రయికర్‌ యూసఫ్‌ యురారే పౌల్సెన్‌ 59వ నిమిషంలో చేసిన గోల్‌తో డెన్మార్క్‌ 1–0 తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో పెరూనే మొదట ఆధిపత్యం చెలాయించింది. అయితే, క్రమంగా డెన్మార్క్‌ కుదురుకుంది. రెండు జట్లు రక్షణాత్మకంగా ఆడుతూ పెద్దగా ప్రయత్నాలు చేయకపోవడంతో మొదటి భాగంలో గోల్‌ నమోదు కాలేదు.

వీఏఆర్‌ పద్ధతి ద్వారా పెరూకు 45వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ లభించినా... కుయెవా గోల్‌గా మలచలేకపోయాడు. మరోవైపు ఎరిక్సన్‌ చురుగ్గా అందించిన బంతిని యురారే దొరకబుచ్చుకుని డెన్మార్క్‌కు 59వ నిమిషంలో ఆధిక్యం చేకూర్చాడు. తర్వాత స్కోరు సమం చేసేందుకు పెరూ తమ స్టార్‌ ఆటగాడు పావ్‌లో గ్యురెరోను సబ్‌స్టిట్యూట్‌గా పంపినా ఫలితం లేకపోయింది. ఏకైక గోల్‌ సాధించిన పౌల్సెన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం దక్కింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top