ముగిసిన డీపీఎస్ క్రీడా సంబరం | Delhi publice school celebrated end of the games | Sakshi
Sakshi News home page

ముగిసిన డీపీఎస్ క్రీడా సంబరం

Nov 1 2013 12:01 AM | Updated on Sep 2 2017 12:10 AM

ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు గురువారం అట్టహాసంగా ముగిశాయి.

రాయదుర్గం, న్యూస్‌లైన్: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు గురువారం అట్టహాసంగా ముగిశాయి. ఖాజాగూడలోని డీపీఎస్ స్కూల్‌లో రెండు రోజులుగా ‘యుఫోరియా’ పేరిట వార్షిక అంతర్ పాఠశాలల క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
 
 నగరంలోని 25 పాఠశాలలకు చెందిన 171 మంది విద్యార్థులు క్రికెట్, అథ్లెటిక్స్ పోటీలతోపాటు సాంస్కృతిక పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి, ప్రిన్సిపల్ రేఖా అగర్వాల్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రమ, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement