కోల్కతాకు స్వల్ప లక్ష్యం | delhi dare devils set target of 99 runs for Kolkata Knight Riders | Sakshi
Sakshi News home page

కోల్కతాకు స్వల్ప లక్ష్యం

Apr 10 2016 9:27 PM | Updated on Sep 3 2017 9:38 PM

కోల్కతాకు స్వల్ప లక్ష్యం

కోల్కతాకు స్వల్ప లక్ష్యం

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ 99 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్డెవిల్స్ 99 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన కోల్ కతా తొలుత ఢిల్లీని బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ ఆది నుంచి తడబడింది.  జట్టులో ఏ ఒక్క ఆటగాడు కనీసం పోరాట పటిమను ప్రదర్శించడంలో విఫలమయ్యారు.

 

డీ కాక్(17), మయాంక్ అగర్వాల్(9), ఎస్ఎస్ ఐయ్యర్(0), కేకే నాయర్(3),  సంజూ శ్యాంసన్(15), నేగీ(11),  బ్రాత్ వైట్(6), క్రిస్ మోరిస్(11),అమిత్ మిశ్రా(3) , జహీర్ ఖాన్(4) ఇలా వరుసగా క్యూట్టడంతో ఢిల్లీ 17.4 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌటయ్యింది. కోల్కతా బౌలర్లలో రస్సెల్, బ్రాడ్ హాగ్లు తలో మూడు వికెట్లు సాధించగా, పీయూష్ చావ్లా,  హేస్టింగ్లకు చెరో రెండు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement