ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఐదవ రోజు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 290/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
అడిలైడ్: ఆస్ట్రేలియా-టీమిండియా జట్ల మధ్య శనివారమిక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఐదవ రోజు ఆసీస్ సెకండ్ ఇన్నింగ్స్ ను 290/5 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ రెండో ఇన్సింగ్స్లో ఐదు వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆసీస్ 363 పరుగుల ఆధిక్యాన్ని చేజిక్కించుకుంది. దాంతో ఆసీస్ భారత్ కు 364 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. తొలి ఇన్నింగ్స్ తొలి రోజునే 145 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్.. రెండో ఇన్నింగ్స్ లో కూడా తన దూకుడు ప్రదర్శించి సెంచరీతో ఆకట్టుకున్నాడు.
అంతకుముందు వేగంగా ఆడుతున్న మిచెల్ మార్ష్‌ని రోహిత్ శర్మ ఔట్ చేయగా, సెంచరీ వీరుడు డేవిడ్ వార్నర్‌ని కరణ్‌శర్మ ఔట్ చేశాడు. కాగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 517/7 స్కోరు వద్ద డిక్లేర్ చేయగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 444 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బ్యాట్స్‌మెన్లలో విరాట్ కోహ్లీ 115, పుజారా 73, రహానే 62, విజయ్ 53, రోహిత్‌శర్మ 43, షమీ 34, శిఖర్‌ధావన్ 25 పరుగులు చేశారు.