మరో ఫన్నీ వీడియో షేర్‌ చేసిన వార్నర్‌

David Warner shares Hilarious Video Shoot At Last Year - Sakshi

సిడ్నీ: ఇటీవల వరుస పెట్టి టిక్‌టాక్‌ వీడియోలు చేసుకుంటూ పోతున్న ఆస్ట్రేలియా ఓపెనర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ దానికి కాస్త గ్యాప్‌ ఇచ్చాడు. టిక్‌టాక్‌ వీడియోలను కాసేపు పక్కనుపెట్టి ఓ పాత వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో షేర్‌ చేశాడు. గత సీజన్‌ సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు భువనేశ్వర్‌ కుమార్‌, కేన్‌ విలియమ్సన్‌లతో కలిసి చేసిన ఓ సరదా వీడియోను తాజాగా వార్నర్‌ పోస్ట్‌ చేశాడు.  

ఇక్కడ  మొదటి వరుసలో ఉన్న సీట్లలో విలియమ్సన్‌, భువీలు ఉండగా, వెనకాల సీట్లో వార్నర్‌ ఒక్కడే కూర్చొని ఉంటాడు. దీనిలో భాగంగా  బ్యాక్‌గ్రౌండ్‌లో పాపులర్‌ పాప్‌ సాంగ్‌ ‘వాట్‌ ఈజ్‌ లవ్‌’ ప్లే అవుతూ ఉంటుంది. దీనికి ముగ్గురు తమ సీట్లలోనే డ్యాన్స్‌ రిథమ్‌ జత కలుపుతారు. ఇందులో విలియమ్సన్‌, భువీలు కారు డ్రైవింగ్‌ చేస్తున్నట్లు యాక్టింగ్‌ చేయగా, వార్నర్‌ మాత్రం ఫుల్‌ స్వింగ్‌లో ఊగిపోతూ ఉంటాడు. దీన్ని తాజాగా షేర్‌ చేసుకున్న వార్నర్‌..‘ ఇది నన్ను నవ్వుల్లో ముంచెత్తింది’ అనే క్యాప్షన్‌ ఇచ్చాడు.(బుట్టబొమ్మగా మారిన వార్నర్‌ భార్య)

రెండు రోజుల క్రితం వార్నర్‌.. భార్య క్యాండీస్‌తో కలిసి బుట్టబొమ్మ తెలుగు సాంగ్‌కు స్టెప్పులేశాడు.  తన భార్య తో కలిసి బుట్టబొమ్మ స్టెప్పుల్ని అనుకరిస్తూ డాన్స్‌ చేశాడు. వీడియోలో వార్నర్, క్యాండీస్‌ కెమిస్ట్రీ కూడా వర్కవుటైంది. అందుకే ఆ పాటలాగే వీరి డాన్స్‌ అదిరిపోయింది. సన్‌రైజర్స్‌ జెర్సీ వేసుకొని చిందులేసిన వార్నర్‌ పాట బాగుందని అర్జున్‌ని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేయగా... హీరో థ్యాంక్యూ చెప్పారు. ఇది బాగా షేర్‌ కావడంతో పాటు సూపర్‌ హిట్‌ పాట కావడంతో వార్నర్‌ డ్యాన్స్‌ వీడీయోకి లైక్‌లు మీద లైక్‌లు వచ్చి పడ్డాయి. (విజయ్‌తో డిన్నర్‌కు ఓకే చెప్పిన ఎలిస్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top