'నన్ను చాలా దారుణంగా అవమానించారు'

Darren Sammy Alleges He Was Racially Abused During IPL - Sakshi

జమైకా : వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ సామి వర్ణ వివక్షతపై తన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో సన్‌రైజర్స్‌కు ఆడినప్పుడు తనపై జాత్యంహకార వ్యాఖ్యలు చేశారని మండిపడ్డాడు. అమెరికాలో జాత్యహంకార దాడిలో ప్రాణాలు కోల్పోయిన జార్జి ప్లాయిడ్‌కు మద్దతుగా అక్కడి స్థానికులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన సామి ఇలాంటివి జరగడం దారుణమని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తాను కూడా వర్ణ వివక్ష వ్యాఖ్యలు ఎదుర్కొన్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సామి పేర్కొన్నాడు.('ఆరోజు రితికా అందుకే ఏడ్చింది')

'నేను ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ జట్టుకు ఆడేటప్పుడు నాతో పాటు శ్రీలంక ఆటగాడు తిసార పెరీరాను 'కలు' అనే పదంతో పిలిచేవారు.అప్పట్లో కలు అంటే బలమైన నల్ల మనిషి అని అనుకున్నా. ఆ సమయంలో వారు నన్ను పొగుడుతున్నారని భావించాను. కానీ ఇప్పుడు ఆ పదానికి అసలైన అర్థం ఏంటో తెలుసుకున్నా. తనతో పాటు పెరీరాపై జట్టులోని ఆటగాళ్లు జాత్యహంకార పదం ఉపయోగించారు. వారు నన్ను చాలా దారుణంగా అవమానించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి వారిపై చాలా కోపంగా ఉంది.' అంటూ చెప్పుకొచ్చాడు. (షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు)

అంతకుముందు ట్విటర్‌ వేదికగా అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలంటూ ఐసిసి, ఇతర క్రికెట్ బోర్డులకు సామి విజ్ఞప్తి చేశాడు. 'ఐసిసితో పాటు ఇతర బోర్డులకు ఒక విజ్ఞప్తి.. నాలాంటి నల్లజాతి వారికి ఏమి జరుగుతుందో మీరు చూడడం లేదా? ఈరోజు అమెరికాలో జరిగిన సంఘటన ప్రపంచంలో ఎక్కడైనా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు నిశబ్ధంగా ఉండాల్సిన సమయం మాత్రం కాదు. సామాజిక అన్యాయంపై స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అంటూ పేర్కొన్నాడు. కాగా విండీస్‌ స్టార్‌ ఓపెనర్‌ క్రిస్ గేల్ కూడా ఫ్లాయిడ్ మరణానికి సంతాపం తెలిపాడు .తాను కూడా జాత్యహంకారానికి గురయ్యాడని ఒక ప్రకటనలో తెలిపాడు. క్రికెట్‌లో జాత్యహంకారం లేదనేది ఒక అపోహ మాత్రమే అని గేల్‌ చెప్పుకొచ్చాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top