టిప్ 16 లక్షలు!

ఏథెన్స్: రెస్టారెంట్లలో బిల్‌తో పాటు టిప్ ఇవ్వడం సర్వసాధారణం. మనకు హోటల్ సిబ్బంది సర్వీస్ ఎంత నచ్చితే అంత ఎక్కువ టిప్ ఇవ్వాలనిపిస్తుంది. కానీ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఓ హోటల్ సిబ్బందికి ఏకంగా 16 లక్షల భారీ టిప్ ఇచ్చాడు. ఈ ఊహకందని భారీ మొత్తం చూడటంతో సిబ్బందే ఆశ్చర్యానికి గురయ్యారు. రొనాల్డో మాత్రం వారి సేవకు మెచ్చే ఇచ్చానని పేర్కొన్నారు. ప్రస్తుతం రొనాల్డో ఇచ్చిన టిప్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.
పోర్చుగల్ జట్టు రౌండ్-16లో ఉరుగ్వేపై ఓటమి చెందడంతో ఫిఫా ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. దీంతో దొరికిన ఖాళీ సమయంలో ఆటగాళ్లు సేదతీరుతున్నారు. పోర్చుగల్ కెప్టెన్ మాత్రం తన కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి గ్రీస్‌లో సందడి చేస్తున్నాడు. సన్నిహితులతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన రోనాల్డో అక్కడి సిబ్బంది మర్యాదలు నచ్చి భారీ మొత్తంలో టిప్ ఇచ్చాడు.
ఇటీవలే స్పెయిన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ క్లబ్ నుంచి ఇటలీకి చెందిన విఖ్యాత ఫుట్‌బాల్ క్లబ్ యువెంటస్‌కు రొనాల్డో బదిలీ అయిన విషయం తెలిసిందే. ఈ కొత్త ఒప్పదం ప్రకారం నాలుగేళ్ల పాటు యువెంటస్‌కు ఆడతాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి