రొనాల్డో కూడా పన్ను ఎగ్గొట్టాడా? | Cristiano Ronaldo defrauded nearly $9 mn in tax: Report | Sakshi
Sakshi News home page

రొనాల్డో కూడా పన్ను ఎగ్గొట్టాడా?

May 26 2017 12:18 AM | Updated on Sep 5 2017 11:59 AM

రొనాల్డో కూడా పన్ను ఎగ్గొట్టాడా?

రొనాల్డో కూడా పన్ను ఎగ్గొట్టాడా?

మైదానంలో ఒకరితో ఒకరు పోటీ పడి దీటుగా ఆడే స్పెయిన్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో,

మాడ్రిడ్‌: మైదానంలో ఒకరితో ఒకరు పోటీ పడి దీటుగా ఆడే స్పెయిన్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో, అర్జెంటీనా స్టార్‌ మెస్సీ ఇద్దరూ ఇద్దరే! అయితే తాజాగా పన్ను ఎగ్గొట్టడంలోనూ వాళ్లిద్దరూ పోటీపడినట్లున్నారు. పన్ను ఎగవేత కేసులో గురువారం మెస్సీకి కోర్టు శిక్ష విధించగా... రొనాల్డో తన ఎండార్స్‌మెంట్ల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ. 58 కోట్ల (9 మిలియన్‌ డాలర్లు) మేర పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తాజాగా వార్తలు వచ్చాయి.

అయితే ఆదాయపు పన్ను లెక్కలు తేల్చే సమయంలో అధికారుల పొరపాటు వల్ల ఇది జరిగిందా లేక కావాలనే తక్కువ చేసి చూపాడా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ తన పొరపాటు లేదని తేలితే రొనాల్డో కేసుల్లేకుండా తప్పించుకోవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా ఎగ్గొడితే మాత్రం జరిమానాతో పాటు 4 నెలల జైలుశిక్షకూ గురయ్యే అవకాశముంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement