భారత జట్లకు మిశ్రమ ఫలితాలు | Chess Olympiad: How Sethuraman scored a brilliant win over legendary Short to help India beat England | Sakshi
Sakshi News home page

భారత జట్లకు మిశ్రమ ఫలితాలు

Sep 12 2016 12:02 AM | Updated on Sep 4 2017 1:06 PM

భారత జట్లకు మిశ్రమ ఫలితాలు

భారత జట్లకు మిశ్రమ ఫలితాలు

ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొమ్మిదో రౌండ్‌లో భారత మహిళల జట్టు

 బాకు (అజర్‌బైజాన్): ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు లభించాయి. తొమ్మిదో రౌండ్‌లో భారత మహిళల జట్టు 3-1తో నెదర్లాండ్స్‌పై గెలుపొందగా... పురుషుల జట్టు 1.5-2.5తో ఉక్రెయిన్ చేతిలో ఓడిపోయింది. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 30 ఎత్తుల్లో పెంగ్ జావోకిన్‌పై, పద్మిని రౌత్ 62 ఎత్తుల్లో ఆనీ హాస్ట్‌పై, తానియా సచ్‌దేవ్ 38 ఎత్తుల్లో అనా మజా కజారియన్‌పై నెగ్గగా... సౌమ్య 40 ఎత్తుల్లో మైకి కిట్‌మాన్ చేతిలో ఓడిపోయింది. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ, ఆధిబన్, విదిత్ తమ ప్రత్యర్థులతో గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా... సేతురామన్ 62 ఎత్తుల్లో కారోబోవ్ చేతిలో ఓడిపోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement