అవినీతిపరులకు చోటు లేదు | Chargesheeted persons to be barred from IOA elections: IOC | Sakshi
Sakshi News home page

అవినీతిపరులకు చోటు లేదు

Aug 16 2013 2:16 AM | Updated on Sep 1 2017 9:51 PM

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇక నుంచి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. ఈమేరకు ఐఓఏ రాజ్యాంగ సవరణను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదించింది.

న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇక నుంచి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. ఈమేరకు ఐఓఏ రాజ్యాంగ సవరణను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదించింది. 43 పేజీల సవరణ ముసాయిదాలో పలు అంశాలను చేర్చారు.
 
 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆఫీస్ బేరర్ లేక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా ఐఓఏ సభ్యుడై ఉండడమే కాకుండా అన్ని పౌర హక్కులు కలిగిన భారత పౌరసత్వం ఉండాలి. ముఖ్యంగా ఏ కోర్టులోనూ కేసులు ఎదుర్కోకుండా ఉండాలి. అలాగే శిక్షార్హమైన క్రిమినల్ లేక అవినీతి కేసుల్లోనూ ఇరుక్కోకుండా ఉండాలి.  ఈ నిబంధనలు కామన్వెల్త్ గేమ్స్ స్కామ్‌లో చార్జిషీట్లు నమోదైన సురేశ్ కల్మాడీ, లలిత్ బానోత్, వీకే వర్మలకు ప్రతిబంధకాలు కానున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement