breaking news
india olympic organisation
-
జాతీయ క్రీడా బిల్లుకు కోర్టు మద్దతు
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా బిల్లుపై కోర్టుకెక్కిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)కు నిరాశే ఎదురైంది. దేశంలోని క్రీడా సమాఖ్యలన్నీ స్పోర్ట్స్ కోడ్ నిబంధనలు పాటించాల్సిందేననే ఆదేశాలను ఐఓఏ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్‌ను జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, నజ్మీ వజిరిలతో కూడిన బెంచ్ తిరస్కరించింది. పాలనలో పారదర్శకత్వం పాటించడంతో పాటు ఆఫీస్ బేరర్లకు గరిష్ట వయసు పరిమితి, పదవీ కాలంపై ఆంక్షలను స్పోర్ట్స్ కోడ్‌లో పొందుపరిచారు. వీటిని ఐఓఏ గతం నుంచే వ్యతిరేకిస్తోంది. ఆఫీస్ బేరర్ల వయస్సు పరిమితి ఈ కోడ్ కారణంగా 70 ఏళ్లకు మించరాదు. స్పోర్ట్స్ కోడ్‌కు అనుకూలంగా ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర క్రీడల మాజీ మంత్రి అజయ్ మాకెన్ స్వాగతించారు. దేశంలో క్రీడాభివృద్ధిపై తన చిత్తశుద్ధి రుజువైందని ఆయన చెప్పారు. ఈ కోడ్ ద్వారా సమాఖ్యలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని తెలిపారు. ఆయన హయాంలోనే 2011లో ఈ బిల్లుకు రూపకల్పన జరిగింది. -
అవినీతిపరులకు చోటు లేదు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఇక నుంచి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. ఈమేరకు ఐఓఏ రాజ్యాంగ సవరణను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదించింది. 43 పేజీల సవరణ ముసాయిదాలో పలు అంశాలను చేర్చారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆఫీస్ బేరర్ లేక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా ఐఓఏ సభ్యుడై ఉండడమే కాకుండా అన్ని పౌర హక్కులు కలిగిన భారత పౌరసత్వం ఉండాలి. ముఖ్యంగా ఏ కోర్టులోనూ కేసులు ఎదుర్కోకుండా ఉండాలి. అలాగే శిక్షార్హమైన క్రిమినల్ లేక అవినీతి కేసుల్లోనూ ఇరుక్కోకుండా ఉండాలి. ఈ నిబంధనలు కామన్వెల్త్ గేమ్స్ స్కామ్‌లో చార్జిషీట్లు నమోదైన సురేశ్ కల్మాడీ, లలిత్ బానోత్, వీకే వర్మలకు ప్రతిబంధకాలు కానున్నాయి.