విదేశీ కోచ్‌ల ఎంపికలో కేంద్రం జోక్యం | Centre to intervene in the choice of foreign coaches | Sakshi
Sakshi News home page

విదేశీ కోచ్‌ల ఎంపికలో కేంద్రం జోక్యం

Nov 10 2016 11:16 PM | Updated on Sep 4 2017 7:44 PM

విదేశీ కోచ్‌ల ఎంపికలో కేంద్రం జోక్యం

విదేశీ కోచ్‌ల ఎంపికలో కేంద్రం జోక్యం

ఇక నుంచి జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్‌ఎస్‌ఎఫ్) ఆయా విభాగాల్లో నియమించే విదేశీ కోచ్‌ల విషయంలో కేంద్రం ...

క్రీడా మంత్రి విజయ్ గోయల్

న్యూఢిల్లీ: ఇక నుంచి జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్‌ఎస్‌ఎఫ్) ఆయా విభాగాల్లో నియమించే విదేశీ కోచ్‌ల విషయంలో కేంద్రం జోక్యం ఉంటుందని క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ అన్నారు. 2020 ఒలింపిక్స్‌కు ఎలా సన్నద్ధమవాలనే అంశంపై వివిధ క్రీడా ప్రముఖులతో నాలుగు గంటలపాటు మంత్రి చింతన్ బైఠక్ జరిపారు. ఇందులో షూటర్ గగన్ నారంగ్, మాజీ హాకీ ఆటగాళ్లు వీరేన్ రస్కిన్హా, జగ్‌బీర్ సింగ్, సాయ్ మాజీ డెరైక్టర్ జనరల్ పాల్గొన్నారు. ‘వచ్చే ఒలింపిక్స్‌కు ఇప్పటినుంచే మన సన్నాహకాలు ప్రారంభం కావాలి. అందుకే ఈ సమావేశం.

ఈ విషయంలో ఇప్పటికే అనేక సూచనలు వచ్చారుు. దేశంలోని క్రీడా వసతులతో పాటు పూర్తి నివేదిక రూపొందించాల్సి ఉంది. ప్రస్తుతం భారత కోచ్‌లకు రూ. 50 వేల నుంచి 2 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ఆయా సమాఖ్యలు విదేశీ కోచ్‌లను కూడా నియమించుకుంటున్నారుు. అరుుతే వీరు ఎక్కడెక్కడ అవసరమో ఆ పోస్టులను మేమే ప్రకటిస్తాం. ఎన్‌ఎస్‌ఎఫ్ నిర్వహించే అన్ని ఈవెంట్లకు మేం మద్దతిస్తాం. అరుుతే అవి పూర్తి పారదర్శకంగా ఉండాలి’ అని గోయల్ తేల్చారు. అలాగే ఇటీవల ఆసియా మహిళల హాకీ చాంపియన్‌‌స ట్రోఫీ నెగ్గిన భారత జట్టును మంత్రి సన్మానించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement