‘సచిన్ బ్రాండ్ విలువ తగ్గేది కాదు’ | 'Brand Sachin Tendulkar' has evolved beyond cricket: WSG India chief | Sakshi
Sakshi News home page

‘సచిన్ బ్రాండ్ విలువ తగ్గేది కాదు’

Sep 13 2013 1:13 AM | Updated on Sep 1 2017 10:39 PM

‘సచిన్ బ్రాండ్ విలువ తగ్గేది కాదు’

‘సచిన్ బ్రాండ్ విలువ తగ్గేది కాదు’

టెండూల్కర్ అనేది ఓ వ్యక్తి పేరు కాదు.. ఇట్స్ ఎ బ్రాండ్.. ఇదీ సచిన్ ఒప్పంద వ్యవహారాలను చూసే వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ (డబ్ల్యుఎస్‌జీ) చెబుతున్న మాట.

న్యూఢిల్లీ: టెండూల్కర్ అనేది ఓ వ్యక్తి పేరు కాదు.. ఇట్స్ ఎ బ్రాండ్.. ఇదీ సచిన్ ఒప్పంద వ్యవహారాలను చూసే వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ (డబ్ల్యుఎస్‌జీ) చెబుతున్న మాట. రెండు దశాబ్దాలుగా అలుపెరగకుండా కెరీర్‌ను సాగిస్తున్న మాస్టర్ బ్రాండ్‌కు విలువ కట్టలేమని, ఇది క్రికెట్‌ను మించి పేరు తెచ్చుకుందని ఈ గ్రూప్ సీనియర్ ఉపాధ్యక్షుడు హరీష్ క్రిష్ణమాచార్ అన్నారు.
 
  2006 నుంచి ఈ దిగ్గజ ఆటగాడి వాణిజ్య ఒప్పందాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. ‘సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అనేది దశాబ్దాలుగా క్రికెట్‌ను మించి పేరు పొందుతూ వస్తోంది. భారత ప్రజల దృష్టిలో ఈ బ్రాండ్‌కు ఎంతో పేరుంది. అందుకే రాబోయే సచిన్ 200వ టెస్టు ఒక్కటినే వేడుకలా జరుపుకోవడం అనవసరం. అతను సాధించిన ప్రతీ రికార్డ్ అత్యున్నతమైందే’ అని హరీష్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement