
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించినప్పటి నుంచి మొదలైన వారిద్దరి స్నేహ బంధం ఇప్పటికి అలానే కొనసాగుతోంది.
అయితే ప్రతీసారి కోహ్లికి సపోర్ట్‌గా ఉండే ఏబీడీ.. ఈసారి మాత్రం కింగ్ అభిమానులను నిరాశపరిచాడు. డివిలియర్స్ ఇటీవల బియర్డ్ బీఫోర్ వికెట్ పాడ్ కాస్ట్‌లో పాల్గోన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌లో తాను చూసిన టాప్-5 బెస్ట్ టెస్టు క్రికెటర్లు ఎవరన్న ప్రశ్న హోస్ట్ నుంచి డివిలియర్స్‌కు ఎదురైంది. ఆశ్యర్యకరంగా డివిలియర్స్ ఎంచుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లి పేరు లేదు.
నేను చాలా మంది దిగ్గజ క్రికెటర్లతో కలిసి ఆడాను. టాప్-5లో అగ్రస్దానం కచ్చితంగా జాక్ కల్లిస్(సౌతాఫ్రికా)కే దక్కుతుంది. ఆ తర్వాత మొహమ్మద్ ఆసిఫ్(పాకిస్తాన్) ఉంటాడు. జీవితంలో నేను ఎదుర్కొన్న అత్యుత్తమ సీమర్ అతడే. ఇక మూడో స్ధానం షేన్ వార్న్(ఆస్ట్రేలియా). వార్నీ బౌలింగ్‌ని ఆడటాన్ని ఆస్వాదిస్తా. కానీ అతడి బౌలింగ్‌లో నేను ఎప్పుడూ ఇబ్బంది పడలేదు.
అతడు బంతిని రిలీజ్ చేసే విధానం, అతడి హెయిర్ స్టైల్.. వర్ణించడానికి మాటలు చాలవు. ఇక నాలుగో స్ధానంలో ఆండ్రూ ఫ్లింటాఫ్(ఇంగ్లండ్) ఉంటాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో కల్లిస్‌కు ఫ్లింటాఫ్ వేసిన యార్కర్ ఇప్పటికీ నాకు గుర్తు ఉంది.
నా జీవితంలో నేను చూసిన అత్యుత్తమ యార్కర్ అదే. చివరగా మరో స్ధానం మిగిలి ఉంది. ఈ ప్లేస్ ఇండియన్ లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్‌కు ఇవ్వాలనకుంటున్నాను. నేను అతడికి ఒక అభిమానని. సచిన్ బ్యాటింగ్ స్టైల్ చాలా అందంగా ఉంటుందని డివిలియర్స్ పేర్కొన్నాడు.
అయితే పక్కన ఉన్న ఇంగ్లండ్ స్టార్ స్పిన్నర్ అదిల్ రషీద్.. కోహ్లికి ఛాన్స్ ఇవ్వలేదని గుర్తించాడు. అందుకు ఏబీడీ స్పందిస్తూ.. సారీ విరాట్. ఇటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టమని అన్నాడు. కాగా ఇటీవల ముగిసిన వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో సౌతాఫ్రికాను డివిలియర్స్ ఛాంపియన్‌గా నిలిపాడు.
చదవండి: తప్పుకొన్న తిలక్ వర్మ.. జట్టులోకి గుంటూరు కుర్రాడు