‘సచిన్ బ్రాండ్ విలువ తగ్గేది కాదు’
న్యూఢిల్లీ: టెండూల్కర్ అనేది ఓ వ్యక్తి పేరు కాదు.. ఇట్స్ ఎ బ్రాండ్.. ఇదీ సచిన్ ఒప్పంద వ్యవహారాలను చూసే వరల్డ్ స్పోర్ట్స్ గ్రూప్ (డబ్ల్యుఎస్‌జీ) చెబుతున్న మాట. రెండు దశాబ్దాలుగా అలుపెరగకుండా కెరీర్‌ను సాగిస్తున్న మాస్టర్ బ్రాండ్‌కు విలువ కట్టలేమని, ఇది క్రికెట్‌ను మించి పేరు తెచ్చుకుందని ఈ గ్రూప్ సీనియర్ ఉపాధ్యక్షుడు హరీష్ క్రిష్ణమాచార్ అన్నారు.
2006 నుంచి ఈ దిగ్గజ ఆటగాడి వాణిజ్య ఒప్పందాలను ఈ సంస్థ పర్యవేక్షిస్తోంది. ‘సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అనేది దశాబ్దాలుగా క్రికెట్‌ను మించి పేరు పొందుతూ వస్తోంది. భారత ప్రజల దృష్టిలో ఈ బ్రాండ్‌కు ఎంతో పేరుంది. అందుకే రాబోయే సచిన్ 200వ టెస్టు ఒక్కటినే వేడుకలా జరుపుకోవడం అనవసరం. అతను సాధించిన ప్రతీ రికార్డ్ అత్యున్నతమైందే’ అని హరీష్ తెలిపారు.