బోపన్న జంట ఓటమి | Bopanna couple lost | Sakshi
Sakshi News home page

బోపన్న జంట ఓటమి

Oct 12 2014 1:38 AM | Updated on Sep 2 2017 2:41 PM

బోపన్న జంట ఓటమి

బోపన్న జంట ఓటమి

న్యూఢిల్లీ: షాంఘై మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ పోరాటం ముగిసింది.

న్యూఢిల్లీ: షాంఘై మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న (భారత్)-ఫ్లోరిన్ మెర్జియా (రుమేనియా) జోడీ పోరాటం ముగిసింది. చైనాలోని షాంఘైలో శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న-మెర్జియా ద్వయం 6-7 (5/7), 4-6తో టాప్ సీడ్ బాబ్ బ్రయాన్-మైక్ బ్రయాన్ (అమెరికా) జంట చేతిలో పోరాడి ఓడింది. 68 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్ చేసింది. సెమీస్‌లో ఓడిన బోపన్న జంటకు 60,730 డాలర్ల (రూ. 37 లక్షల 17 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 360 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement