బోల్ట్కు అనూహ్యంగా ఏమైంది? | Sakshi
Sakshi News home page

బోల్ట్కు అనూహ్యంగా ఏమైంది?

Published Sat, Jul 2 2016 8:42 AM

బోల్ట్కు అనూహ్యంగా ఏమైంది?

కింగ్స్టన్: పరుగుల చిరుత ఉస్సేన్ బోల్ట్ జమైకాలో నిర్వహిస్తున్న ఒలంపిక్స్ 100మీటర్ల ఫైనల్ ట్రయల్స్ నుంచి అనూహ్యంగా తప్పుకున్నాడు. ఏదో తీవ్ర గాయం కారణంగా అందులో పాల్గొనడం లేదని తెలిసింది. దీంతో మరికొద్ది రోజుల్లో రియోడిజనిరోలో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో అతడు పాల్గొనే అంశంపై అనుమానాలు రేకెత్తాయి. జమైకా నేషనల్ సీనియర్ చాంపియన్ షిప్స్ రియోడిజనిరోకు వెళ్లే వారికోసం ట్రయల్స్ నిర్వహిస్తోంది. శుక్రవారం రాత్రి 100మీటర్ల ఫైనల్కు బోల్ట్ ఎంపికయ్యాడు.

మరోపక్క, శని, ఆదివారాల్లో 200 మీటర్ల పోటీ ఉంది. ఈలోగా అనూహ్యంగా ఈ ట్రయల్స్ నుంచి తాను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడని అధికారులు ప్రకటించారు. కాగా, మెడికల్ కారణాలతో మినహాయింపును పొంది రియోకు వెళ్లొచ్చు. ఈ సందర్భంగా బోల్ట్ కూడా అధికారికంగా ప్రకటన చేశాడు. 'గత రాత్రి జరిగిన 100మీటర్ల పరుగుపందెం తర్వాత నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. వైద్యుడిని సంప్రదించగా ఆయన వెంటనే చికిత్స అవసరం అని చెప్పారు. అందుకే 100 మీటర్ల ఫైనల్ కు, మిగితా ఈవెంట్స్ కు మెడికల్ సర్టిఫికెట్ పెట్టి జూలై 22 లండన్ యానివర్సరీ గేమ్స్లో పాల్గొని అర్హత సాధించి రియోకు వెళతాను' అని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement