హీరోయిన్ తో భువీ డేటింగ్..! | Bhuvaneshwar Kumar’s mystery date was Anusmriti | Sakshi
Sakshi News home page

హీరోయిన్ తో భువీ డేటింగ్..!

May 18 2017 7:42 PM | Updated on Sep 5 2017 11:27 AM

హీరోయిన్ తో భువీ డేటింగ్..!

హీరోయిన్ తో భువీ డేటింగ్..!

ఇటీవల టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో ఒకటి వాడివేడి చర్చకు దారి తీసింది.

ముంబై: టీమిండియా ప్రధాన పేసర్ భువనేశ్వర్ కుమార్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటో ఒకటి వాడివేడి చర్చకు దారి తీసింది. ఆ ఫొటోకు 'డిన్నర్ డేట్' అనే క్యాప్షన్ పెట్టడమే భువీ వార్తల్లో నిలవడానికి కారణమైంది. నగరంలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లిన సందర్భంలో చేతిలో గ్లాస్, అందులో రెండు స్ట్రాలు ఉన్న ఫొటోను గత కొన్ని రోజుల క్రితం అప్ లోడ్ చేశాడు భువి. దానికి డిన్నర్ డేట్ అని క్యాప్షన్ తగిలించాడు. అయితే కేవలం భువీ మాత్రమే ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. త్వరలోనే ఫుల్ పిక్చర్ ను చూస్తారంటూ మరింత ఆసక్తిని రేకెత్తించాడు. దాంతో భువీ.. ఆ అమ్మాయి ఎవరు? అంటూ అభిమానులు తీవ్రంగా చర్చించుకున్నారు.

అయితే ఆ అమ్మాయి ఒక హీరోయిన్ గా తెలుస్తోంది. ఇప్పటికే పలు బెంగాలీ సినిమాల్లో నటించి బాలీవుడ్ అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న అనుస్మృతీ సర్కార్ అని సమాచారం. ఆ రెస్టారెంట్ నుంచి బయటకొచ్చిన తరువాత కారులో కూర్చున‍్న సమయంలో కొంతమంది ఫొటోగ్రాఫర్లు క్లిక్ మనిపించిన ఫొటోలు అందుకు బలాన్నిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ అమ్మాయి అనుస్మృతీ సర్కార్‌ అవునో.. కాదో భువీనే తేల్చాలి. అసలు  ఫుల్ పిక్చర్ ను చూస్తారంటూ భువీ పోస్ట్ చేయడం వెనుక ఉద్దేశమూ అతనికే తెలియాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement