ఏజీఎంపై నేడు సమావేశం | BCCI Members to Discuss AGM Impasse on September 7 | Sakshi
Sakshi News home page

ఏజీఎంపై నేడు సమావేశం

Sep 7 2014 12:35 AM | Updated on Sep 2 2017 12:58 PM

బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై బోర్డు ఉన్నతాధికారులు నేడు (ఆదివారం) సమావేశం కానున్నారు.

చెన్నై: బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఎప్పుడు నిర్వహించాలనే విషయంపై బోర్డు ఉన్నతాధికారులు నేడు (ఆదివారం) సమావేశం కానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఏజీఎం ఈనెల 30లోగా జరగాల్సి ఉంది. అయితే మెజారిటీ సభ్యులు మాత్రం... ఐపీఎల్ బెట్టింగ్, ఫిక్సింగ్‌పై ముకుల్ ముద్గల్ కమిటీ తుది నివేదిక ఇచ్చే దాకా వాయిదా వేయాలని భావిస్తున్నారు.
 
  ఈ భేటీలో పాల్గొనే దాదాపు 20 మంది  సభ్యులు శ్రీనివాసన్ మద్దతుదారులే. బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్... హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికల కారణంగా ఈ సమావేశానికి గైర్హాజరు కానున్నారు. ముద్గల్ కమిటీ నివేదికలో శ్రీనివాసన్‌కు క్లీన్‌చిట్ లభిస్తే మరోసారి అధ్యక్షుడిగా ఆయన ఎన్నికకు ఎలాంటి అడ్డంకి ఉండబోదని ఆయన మద్దతుదారుల ఆలోచన. ప్రస్తుతం శ్రీనివాసన్ ప్రత్యర్థి శశాంక్ మనోహర్‌కు నాలుగు రాష్ట్రాల యూనిట్ల మద్దతు మాత్రమే ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement