ప్రమోషన్కు సైతం నర్సింగ్ దూరం | Banned Narsingh Yadav forced to miss WFI event | Sakshi
Sakshi News home page

ప్రమోషన్కు సైతం నర్సింగ్ దూరం

Aug 27 2016 12:09 PM | Updated on Sep 4 2017 11:10 AM

ప్రమోషన్కు సైతం నర్సింగ్ దూరం

ప్రమోషన్కు సైతం నర్సింగ్ దూరం

ఇటీవల కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పుతో రియో ఒలింపిక్స్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్.. ఇప్పుడు ఆ గేమ్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనే అంశంపై కూడా సందిగ్ధత నెలకొంది.

న్యూఢిల్లీ: ఇటీవల కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తీర్పుతో రియో ఒలింపిక్స్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగిన భారత  రెజ్లర్ నర్సింగ్ యాదవ్.. ఇప్పుడు ఆ గేమ్స్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనే అంశంపై కూడా సందిగ్ధత నెలకొంది. మరో నాలుగు నెలల్లో భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్యూఎఫ్ఐ) ఆధ్వర్యంలో  విశ్వవిజేత గామా రెజ్లింగ్ పేరుతో కొత్తగా నిర్వహించదలచిన వరల్డ్ కప్ పోటీల ప్రమోషన్ కార్యక్రమాలకు నర్సింగ్ దూరం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయాన్ని తాజాగా బ్యూఎఫ్ఐ సెక్రటరీ టీఎన్ ప్రసూద్ ధృవీకరించారు.  కోర్టు తీర్పుతో నర్సింగ్ యాదవ్ భవిష్యత్ అంధకారంలో పడిందన్న ప్రసూద్.. ఇక నుంచి గేమ్స్ ప్రమోషన్ కార్యక్రమాలకు సైతం ఆ రెజ్లర్ దూరం అయ్యే అవకాశం ఉందన్నారు.

 

అయితే నర్సింగ్ యాదవ్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చా? లేదా అనేది దానిపై వాడా(వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ' ఈ పోటీల్లో నర్సింగ్ యాదవ్ పాల్గొనడం లేదనేది కోర్టు తీర్పును బట్టి మనకు తెలుసు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ గేమ్స్ ప్రమోషన్లో కూడా నర్సింగ్ పాల్గొనకపోతే ఆ స్టేజ్కు అందం ఉండదు. ఈ ఈవెంట్ కు సంబంధించి అత్యధిక శాతం క్వాలిఫికేషన్ పోటీలు మహారాష్ట్రలో జరుగనున్నాయి. మహారాష్ట్ర రెజ్లర్ అయిన నర్సింగ్ యాదవ్ కనీసం ప్రమోషన్ లోనైనా ఉంటే ఈ పోటీలకు కొంత ఊపు వస్తుంది. దీనిపై వాడాను ఆశ్రయించాల్సిన అవసరం ఉంది' టీఎన్ ప్రసూద్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement