నెట్‌బాల్ కెప్టెన్లు బాలరాజ్, శిరీష | Balaraj,shirisha net ball captains | Sakshi
Sakshi News home page

నెట్‌బాల్ కెప్టెన్లు బాలరాజ్, శిరీష

Feb 28 2014 12:09 AM | Updated on Sep 2 2017 4:10 AM

జాతీయ సీనియర్ నెట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు బాలరాజ్ (హైదరాబాద్) సారథ్యం వహిస్తాడు.

ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: జాతీయ సీనియర్ నెట్‌బాల్ టోర్నమెంట్‌లో పాల్గొనే రాష్ట్ర పురుషుల జట్టుకు బాలరాజ్ (హైదరాబాద్) సారథ్యం వహిస్తాడు. పురుషుల జట్టుకు శిరీషా రాణి (రంగారెడ్డి) కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఈ పోటీలు మార్చి 1 (శనివారం) నుంచి 4 వరకు పాట్నాలో జరుగుతాయి. ఈ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్ల జాబితాను రాష్ట్ర నెట్‌బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి సమ్మయ్య ప్రకటించారు.
 
 రాష్ట్ర పురుషుల జట్టు: బాలరాజ్ (కెప్టెన్), అక్తర్ పాషా (హైదరాబాద్), సాయికృష్ణ, శ్రవ ణ్ కుమార్ (కృష్ణా జిల్లా), ఓంప్రకాష్ (మెదక్), విహారి, అఖిల్ (ఖమ్మం), అనిల్ (వరంగల్), సందీప్(కరీంనగర్), మహేశ్వర్ (నిజామాబాద్), సాయి కుమార్ (రంగారెడ్డి).
 
 రాష్ట్ర మహిళల జట్టు: శిరీషా రాణి(కెప్టెన్), వేదవతి (రంగారెడ్డి), వరలక్ష్మి (పశ్చిమ  గోదావరి), డి.పావని (హైదరాబాద్), ఆర్తి (ప్రకాశం), శివాని, హర్షిణి, అదితి, వాణి, దేవి వర్జిత (ఖమ్మం), రేష్మ (మెదక్), సంయుక్త (కృష్ణా), కోచ్ కమ్ మేనేజర్ విఘ్నేశ్.
 

Advertisement
 
Advertisement
Advertisement