సెమీస్‌లో ఆస్ట్రేలియా | Australia women through to T20 semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో ఆస్ట్రేలియా

Mar 30 2014 1:33 AM | Updated on Mar 23 2019 8:32 PM

మహిళల టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 94 పరుగులతో పాకిస్థాన్ జట్టును ఓడించింది.

సిల్హెట్: మహిళల టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 94 పరుగులతో పాకిస్థాన్ జట్టును ఓడించింది. తొలుత ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 2 వికెట్లకు 185 పరుగుల భారీ స్కోరు చేసింది.
 
 ఆ తర్వాత పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 91 పరుగులే చేసింది. పాక్‌పై గెలుపుతో ఆస్ట్రేలియా గ్రూప్ ‘ఎ’ పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 86 పరుగుల భారీ తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గి సెమీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement