టీమిండియా లక్ష్యం 299

Australia Set Target 299 To India - Sakshi

అడిలైడ్‌: భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. టీమిండియాకు 299 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  షాన్‌ మార్ష్‌ సెంచరీకి మ్యాక్స్‌వెల్‌ మెరుపులు తోడవడంతో ఆసీస్‌ మంచి స్కోరు సాధించింది. మార్ష్‌ 123 బంతుల్లో 11 ఫోర్లతో 3 సిక్సర్లతో 131 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్‌ 37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 48 పరుగులు బాదాడు.

అలెక్స్‌ క్యారీ 18, ఖవాజా 21, పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌‌ 20, స్టొయినిస్‌ 29, లయన్‌ 12 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌ కుమార్‌ 4, మహ్మద్‌ షమి 3 వికెట్లు పడగొట్టారు. జడేజా ఒక వికెట్‌ తీశాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top