శ్రీలంక లక్ష్యం 265.. భారత్తో పోరు | Asia cup.. India put 265 runs target to Srilanka | Sakshi
Sakshi News home page

శ్రీలంక లక్ష్యం 265.. భారత్తో పోరు

Feb 28 2014 5:05 PM | Updated on Sep 2 2017 4:12 AM

శ్రీలంక లక్ష్యం 265.. భారత్తో పోరు

శ్రీలంక లక్ష్యం 265.. భారత్తో పోరు

ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్నమ్యాచ్లో శిఖర్ ధవన్ (94), విరాట్ కోహ్లీ (48) రాణించడంతో టీమిండియా సముచిత స్కోరు చేసింది.

ఫతుల్లా: ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్నమ్యాచ్లో శిఖర్ ధవన్ (94), విరాట్ కోహ్లీ (48) రాణించడంతో టీమిండియా సముచిత స్కోరు చేసింది. లంకేయులకు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా ఆరంభంలో నిలకడగా ఆడిన భారత్.. మిడిలార్డర్ బ్యాట్స్మెన్ వైఫల్యంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (13) నిరాశ పరిచినా.. మరో ఓపెనర్ శిఖర్ ధవన్ జట్టును ఆదుకున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (48) మరోసారి రాణించాడు. కోహ్లీ, ధవన్ రెండో వికెట్కు 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. భారత ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతున్న దశలో ఈ జోడీని లంక బౌలర్ అజంతా మెండిస్ బౌల్డ్ చేయడంతో కష్టాలు మొదలయ్యాయి. విరాట్ రెండు పరుగులతో హాఫ్ సెంచరీని, ధవన్ ఆరు పరుగులతో సెంచరీని చేజార్చుకున్నారు. ఆ తర్వాత రహానె (22), అంబటి రాయుడు (18), దినేశ్ కార్తీక్ (4), స్టువర్ట్ బిన్నీ (0) పరుగుల వేటలో చతికిలపడ్డారు. చివర్లో జడేజా 22 (నాటౌట్) , అశ్విన్ 18, మహమ్మద్ షమీ 14 (నాటౌట్) పరుగులు చేశారు. ఏడు బంతులాడిన షమీ రెండు సిక్సర్లు బాదడంతో స్కోరు 250 మార్క్ దాటింది. లంక బౌలర్లు మెండిస్ నాలుగు, సేననాయకె మూడు వికెట్లు పడగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement