దేశం కోసం

Army Recruitments rally karimnagar - Sakshi

ఏడోరోజు ముగిసిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

3,200 మంది హాజరు

190 మంది మెడికల్‌ పరీక్షకు అర్హత

నేడు ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్‌

అభ్యర్థులకు సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్‌ ర్యాలీ

హాజరుకానున్న 4951 మంది అభ్యర్థులు

కరీంనగర్‌స్పోర్ట్స్‌: దేశసేవకోసం యువత తరలివస్తోంది. ఆర్మీలో చేరడానికి తెలంగాణ యువకులు ఉత్సాహం చూపుతున్నారు. కరీంనగర్‌ పట్టణంలోని అంబేద్కర్‌ స్టేడియంలో ఏడోరోజు ఆర్మీరిక్రూట్‌మెంట్‌ ర్యాలీ ముగిసింది. తెలంగాణలోని అన్నిజిల్లాల అభ్యర్థులకు సోల్జర్‌ క్లర్క్, ఎస్కేటీ, సోల్జర్‌నర్సింగ్‌ విభాగంలో ర్యాలీ నిర్వహించారు. 3,200మంది హాజరయ్యారు. 190మంది మెడికల్‌టెస్టుకు అర్హత సాధించారు. బుధవారం అదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్‌ అభ్యర్థులకు సోల్జర్‌ట్రేడ్స్‌మెన్‌ విభాగంలో ర్యాలీ జరగనుంది. 4,951 మంది హాజరుకానున్నారు.

190మంది అర్హత
సోల్జర్‌ క్లర్క్‌/ఎస్కెటీ, సోల్జర్‌నర్సింగ్‌ అసిస్టెంట్‌ విభాగానికి 4,632మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి నియామక ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థుల ఎత్తు కొలవగా 3,200మంది రన్నింగ్‌కు అర్హత సాధించారు. వీరికి బ్యాచ్‌కు190 మంది చొప్పున 1600మీటర్ల రన్నింగ్‌ నిర్వహించగా జీపీ1, జీపీ2లలో కలిపి 190మంది అర్హత మెడికల్‌కు సాధించారు. 

ట్రైనీ ఐఏఎస్‌ పరిశీలన
ఆర్మీ నియామక ర్యాలీని మంగళవారం ట్రైనీ ఐఏఎస్‌ ప్రావీణ్య సందర్శించారు. రన్నింగ్, డిచ్‌జంప్, పుల్‌అప్స్‌ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిక్రూట్‌మెంట్‌ డైరెక్టర్‌కల్నల్‌ పూరీ నియామకాల తీరును వివరించారు.

కొనసాగుతున్న మెడికల్‌ టెస్టులు..
ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో భాగంగా మెడికల్‌ టెస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆర్మీ అధికారులు వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు. శరీరంలో ఉన్నపుట్టు మచ్చలను మార్క్‌చేసి మెడికల్‌ టెస్టులకు పంపించారు. 
                                   
అర్ధరాత్రి స్టేడియంలో నిద్రిస్తున్న అభ్యర్థులు
నేటి ర్యాలీ
ఆర్మీ నియామకాల్లో భాగంగా బుధవారం అదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్‌ జిల్లాల వారికి సోల్జర్‌ట్రేడ్స్‌మెన్‌ విభాగానికి ర్యాలీ జరగనుంది. దీనికి 4,951 మంది దరఖాస్తు చేసుకున్నారు.

సోల్జర్‌ ట్రేడ్స్‌మ్యాన్‌ నియామక అర్హత...
శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 162 సెం.మీ, బరువు 50 కేజీలు, ఛాతీ 77 సెం.మీ, గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.

నిర్వహించే పరీక్షలు
ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌(పీఎఫ్‌టీ): 1.6 కి.మీ దూరాన్ని జీపీ:1వారు 5 నిమిషాల 30 సెకండ్లలోపు. జీపీ 2 వారు 5 నిమిషాల 31 సెకండ్ల నుంచి 5 నిమిషాల 45 సెకండ్లలోగా చేరుకోవాలి. 9అడుగుల డిచ్‌ జంప్, కనీసం 6పుల్‌అప్స్, బ్యాలెన్సింగ్‌ బీమ్‌లో నడవాలి.

సోల్జర్‌ కావాలనే కోరిక...
ఆర్మీలో చేరాలనేది నా కోరిక. చిన్నప్పటి నుంచి సైనికులంటే చాలా ఇష్టం. ఆర్మీ నియామకాల ర్యాలీ నోటిఫికేషన్‌కు ముందునుంచే సుమారు నాలుగు నెలలు సాధన చేశాను. ఇప్పుడు రన్నింగ్‌ను ఈజీగా చేశాను.   – పి.నరేష్, మద్దూర్, మహబూబ్‌నగర్‌

నాన్న కోరిక తీర్చాలి
మానాన్నకు సైనికులు అంటే ఇష్టం. ఆయన కోరిక నన్ను సైనికున్ని చేయాలని. అందుకే నెల రోజుల ముందు నుంచే సాధన చేయడం ప్రారంభించా. ఇప్పుడు మెడికల్‌కు అర్హత సాధించా. ఆర్మీలో సైనికుడిని అయ్యి నాన్న కోరిక నెరవేర్చుతా. – ఎం.నవీన్, నారాయణ గూడేం, నల్గొండ

ఇది లాస్ట్‌ టైమ్‌...
ఇప్పటికి పదిసార్లు ఆర్మీనియామక ర్యాలీలో పాల్గొన్నా. 7సార్లు పరీక్షలో ఫెయిల్‌ అయ్యా. రెండుసార్లు మెడికల్‌కు రిజక్ట్‌ అయ్యాను. ఇదిలాస్ట్‌. ఇప్పుడు మెడికల్‌కు అర్హత సాధించా. సైనికుడిగా ఎంపిక అవుతాన్న నమ్మకం ఉంది. – ఎం.నరేశ్, లింగాపూర్, అదిలాబాద్‌

లైఫ్‌ ఆంబీషన్‌..
ఆర్మీలో సైనికునిగా ఉండాలన్నది లైఫ్‌ ఆంబీషన్‌. చిన్నటినుంచే నిరంతర సాధన చేస్తున్నా. కరీంనగర్‌లో అర్హత సాధించా. మెడికల్‌ టెస్ట్‌కు అర్హత సాధించా. సైనికునిగా నిలుస్తానన్న నమ్మకం కలిగింది.– ధరావత్‌ శివరామ్,జల్లపల్లిఫరమ్, నిజామాబాద్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top