భారత మహిళా ఆర్చర్లు దీపికా కుమారి, బాంబాయ్లా దేవి, లక్ష్మీరాణి మహిలు రియో ఒలింపిక్స్కు ఎంపికయ్యారు.
న్యూఢిల్లీ: భారత మహిళా ఆర్చర్లు దీపికా కుమారి, బాంబాయ్లా దేవి, లక్ష్మీరాణి మహిలు రియో ఒలింపిక్స్కు ఎంపికయ్యారు. గత మూడు నెలల ప్రదర్శన ఆధారంగా చేసుకుని భారత ఆర్చరీ సంఘం వీరిని ఎంపిక చేసింది.ఈ ముగ్గురు వ్యక్తిగత విభాగాల్లో పోటీ పడటంతో పాటు, టీమ్ ఈవెంట్లో కూడా ఈ త్రయమే జట్టు కట్టనుంది.
ఆర్చరీ ట్రయల్స్, శిక్షణలో భాగంగా గత మూడు నెలల నుంచి వివిధ నగరాల్లో ఆరు స్టేజ్లలో నిర్వహించిన సెలక్షన్ అనంతరం ఈ ముగ్గురు పేర్లను భారత అర్చరీ సంఘం ఖరారు చేసింది. ఈ మేరకు సోమవారం మహిళా ఆర్చర్ల పేర్లను ప్రకటించింది.