హడలెత్తించిన అనిరుధ్ | anirudh takes 5 wickets for gouds eleven team | Sakshi
Sakshi News home page

హడలెత్తించిన అనిరుధ్

Aug 18 2016 12:18 PM | Updated on Sep 4 2017 9:50 AM

గౌడ్స్ ఎలెవన్ బౌలర్ అనిరుధ్ శ్రీవాస్తవ (5/71) విజృంభించడంతో ఎవర్‌గ్రీన్ బ్యాట్స్‌మెన్ విలవిల లాడారు.

సాక్షి, హైదరాబాద్: గౌడ్స్ ఎలెవన్ బౌలర్ అనిరుధ్ శ్రీవాస్తవ (5/71) విజృంభించడంతో  ఎవర్‌గ్రీన్ బ్యాట్స్‌మెన్ విలవిల లాడారు. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో రెండో రోజు ఆటలో ఎవర్‌గ్రీన్ జట్టు 225 పరుగుల వద్ద ఆలౌటైంది. జితేందర్ త్యాగి 44, చందన్ సహాని 47 పరుగులు చేశారు. భౌమిక్ (33 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. గౌడ్స్ ఎలెవన్ జట్టుకు 62 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మొదటి రోజు ఆటలో గౌడ్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 287 పరుగులు చేసింది.

 

మరో మ్యాచ్‌లో కాంటినెంటల్ బౌలర్ మనీష్ (5/73) చెలరేగడంతో గుజరాతీ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. రెండో రోజు బ్యాటింగ్‌కు దిగిన గుజరాతీ జట్టు 67.3 ఓవర్లలో 220 పరుగులు చేసి ఆలౌటైంది. రోహిత్ రెడ్డి (59), ఆదిత్య (65) అర్ధసెంచరీలతో రాణిం చగా... శ్రవణ్ కుమార్ 34 పరుగులు చేశాడు. తొలిరోజు ఆటలో కాంటినెంటల్ జట్టు 94.3 ఓవర్లలో 236 పరుగులు చేసింది.


 ఇతర మ్యాచ్‌ల ఫలితాలు


 ఏఓసీ: తొలి ఇన్నింగ్స్ 481/9 (విష్ణు తివారి 80; సతీశ్ 3/89, యశ్‌పురి 3/114), జెమినీ ఫ్రెండ్స్: 99 (కోటేశ్వర్ రావు 3/26), ఫాలో ఆన్: 5/1 (1.5 ఓవర్లు).


 స్పోర్టింగ్ ఎలెవన్: 395/9 డిక్లేర్డ్ (సూర్యప్రసాద్ 37; రవితేజ 4/86), ఎంపీ కోల్ట్స్: 218/6 (హర్ష జున్‌జున్‌వాలా 51, నిఖిల్ యాదవ్ 30, రవితేజ 77 బ్యాటింగ్, ప్రణీత్ 38; సాత్విక్ రెడ్డి 3/72).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement