జట్టుతో పాటు కుంబ్లే వెళ్లడం లేదు! | Anil Kumble 'stays back' for ICC meeting | Sakshi
Sakshi News home page

జట్టుతో పాటు కుంబ్లే వెళ్లడం లేదు!

Jun 20 2017 3:49 PM | Updated on Sep 5 2017 2:04 PM

జట్టుతో పాటు కుంబ్లే వెళ్లడం లేదు!

జట్టుతో పాటు కుంబ్లే వెళ్లడం లేదు!

భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేతో కెప్టెన్ విరాట్ కోహ్లికి విబేధాలంటూ గత కొంతకాలంగా వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తూ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

లండన్: భారత క్రికెట్ జట్టు  ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేతో కెప్టెన్ విరాట్ కోహ్లికి విబేధాలంటూ గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తూ మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. చాంపియన్స్ ట్రోఫీ ముగించుకుని వెస్టిండీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టుతో పాటు అనిల్ కుంబ్లే వెళ్లడం లేదట.  మంగళవారం భారత జట్టు విండీస్ పర్యటనకు బయల్దేరుతుంటే కుంబ్లే మాత్రం మరికొన్ని రోజులు లండన్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. కేవలం విరాట్ కోహ్లితో కలిసి జట్టు సభ్యులు మాత్రమే బార్బోడాస్ విమానం ఎక్కనున్నారట.

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న కుంబ్లే.. ఐసీసీ వార్షిక సమావేశంలో భాగంగా కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండబోతున్నడనేది సమాచారం.జూన్ 19 వ తేదీన మొదలైన ఐసీసీ వార్షిక సమావేశాలు జూన్ 23 వరకూ కొనసాగనున్నాయి.  ఈ నేపథ్యంలో క్రికెట్ కమిటీ చైర్మన్ గా ఉన్న కుంబ్లే.. ఐసీసీ సమావేశాల్లో తప్పకుండా పాల్గొనాల్సిన పరిస్థితి.  కుంబ్లే అధ్యక్షతన జరిగే క్రికెట్ కమిటీ మీటింగ్ గురువారం జరుగనుంది. ఇందులో క్రికెట్ కు సంబంధించి పలు కీలక అంశాలను చర్చించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement