'ఫుట్‌బాల్ టీంను కొందామనుకుంటున్నా'

American Former Boxer Floyd Mayweather Interested In Buying Premier League Club - Sakshi

న్యూయార్క్‌ : అమెరికా బాక్సింగ్ దిగ్గజం ఫ్లాయిడ్ మేవెదర్ ఫుట్‌బాల్‌ ప్రీమియర్ లీగ్ క్లబ్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తున్నాడు.ఇదే విషయమై గతవారం టైన్‌సైడ్‌లోని ఓ- 2సిటీ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఫుట్‌బాల్‌ టీమ్‌ న్యూ కాజిల్ యునైటెడ్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు పేర్కొన్నాడు. కాగాన్యూకాజిల్‌కు ప్రస్తుత యజమానిగా వ్యవహరిస్తున్న మైక్ ఆష్లే నుంచి క్లబ్‌ను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నారా.. అని మేవెదర్‌ను విలేకరులు ప్రశ్నించారు.

దానికి మేవెదర్‌ స్పందిస్తూ..  ‘యూఎస్‌లో మేము దీనిని సాకర్ అని పిలుస్తాము. కాని న్యూ కాజిల్ ఫుట్‌బాల్ జట్టుపై ఎలాంటి నమ్మకం లేదు. నేను న్యూ కాజిల్ జట్టును కొనాలని భావిస్తే ముందు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడూ కొత్త వ్యాపార అవకాశాలకు సిద్ధంగా ఉంటాను. నాకు బాక్సింగ్‌ ఒక్కటే కాకుండా మిగతా ఆటలంటే కూడా చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు ఫుట్‌బాల్‌ ప్రీమియర్‌ లీగ్‌ను కొందామనే ఆలోచన చేశా. సాకర్ నా ఆట కాకపోవచ్చు.. కానీ ప్రతి ఆట గురించి నాకు కొంతమేర అవగాహన ఉంది' అని మేవెదర్‌ వెల్లడించాడు.(షఫాలీని అలా చూడటం కష్టమైంది)

అయితే మేవెదర్, బ్రిటిష్ బిలియనీర్ ఆష్లే మధ్య ఇంకా దీని గురించి ఎటువంటి అధికారిక చర్చలు జరగలేదు. కానీ న్యూకాజిల్‌లో వాటాను కొనుగోలు చేయడానికి ఫ్లాయిడ్‌ కంపెనీ మనీ టీమ్‌ ఆసక్తి చూపిస్తోందని టిఎమ్‌జెడ్ స్పోర్ట్స్  ఇటీవలే నివేదించింది. కాగా గతేడాదిఫ్లాయిడ్‌ మేవెదర్‌ జపాన్‌లో జరిగిన ఒక ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో పాల్గొని  20 ఏళ్ల కిక్-బాక్సర్ టెన్షిన్ నాసుకావాపై సునాయాస విజయం సాధించి  ఫ్రొఫెషనల్‌ బాక్సింగ్‌కు వీడ్కోలు పలికాడు. కేవలం రెండే నిమిషాలు జరిగిన ఆ బౌట్‌లో  నాసుకావాను ఓడించి 9 మిలియన్‌ డాలర్లను గెలుచుకున్నాడు. కాగా ఫ్లాయిడ్‌ మేవెదర్‌ తన ఫ్రొఫెషనల్‌ బాక్సింగ్‌ కెరీర్‌లో 50 విజయాలతో పాటు 26 ప్రపంచ టైటిళ్లను నెగ్గాడు. కొంతకాలం కిందట ఫ్రొఫెషనల్‌ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన మేవెదర్‌ ప్రస్తుతం అమెరికా బాక్సింగ్‌ ప్రమోటర్‌గా కొనసాగుతున్నాడు.  (మనకూ ఒక రోజు వస్తుంది: గంగూలీ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top