శ్రీకాంత్‌కు షాకిచ్చిన జయరామ్‌

Ajay Jayaram Stuns Kidambi Srikanth In Barcelona Spain Masters - Sakshi

28 నిమిషాల్లోనే జయరామ్‌ చేతిలో ఓటమి

క్వార్టర్స్‌లో సైనా, సమీర్‌  

బార్సిలోనా: కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తోన్న భారత బ్యాడ్మింటన్‌ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ మళ్లీ తడబడ్డాడు. బార్సిలోనా స్పెయిన్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే నిష్క్రమించాడు. భారత్‌కే చెందిన ప్రపంచ 68వ ర్యాంకర్‌ అజయ్‌ జయరామ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 28 నిమిషాల్లో 6–21, 17–21తో ఓడిపోయాడు. పురుషుల సింగిల్స్‌ మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సమీర్‌ వర్మ (భారత్‌) 21–14, 16–21, 21–15తో కాయ్‌ షాఫెర్‌ (జర్మనీ)పై నెగ్గి క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. 

మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సైనా నెహా్వల్‌ (భారత్‌) 21–10, 21–19తో మరియా ఉలిటినా (ఉక్రెయిన్‌)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–అశి్వని (భారత్‌) జంట 18–21, 14–21తో గాబ్రియెలా–స్టెఫానీ (బల్గేరియా) జోడీ చేతిలో... మిక్స్‌డ్‌ డబుల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్‌ చోప్రా (భారత్‌) ద్వయం 16–21, 21–16, 13–21తో సూన్‌ హువాట్‌–లాయ్‌ షెవోన్‌ జేమీ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయాయి.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top