సెమీ ఫైనల్లో జయరామ్ | Ajay Jayaram Advances To Semi-Finals Of Dutch Open | Sakshi
Sakshi News home page

సెమీ ఫైనల్లో జయరామ్

Oct 15 2016 3:56 PM | Updated on Sep 4 2017 5:19 PM

సెమీ ఫైనల్లో జయరామ్

సెమీ ఫైనల్లో జయరామ్

డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్, భారత ఆటగాడు అజయ్ జయరామ్ సెమీస్లోకి ప్రవేశించాడు.

అల్మెర(నెదర్లాండ్స్):డచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన డిఫెండింగ్ చాంపియన్, భారత ఆటగాడు అజయ్ జయరామ్ సెమీస్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ మ్యాచ్లో జయరామ్ 21-15, 21-18 తేడాతో కోల్హో డీ ఒలివైరా(బ్రెజిల్)పై గెలిచి సెమీస్ కు చేరాడు. కేవలం 32 నిమిషాల్లో ముగిసిన క్వార్టర్ ఫైనల్ పోరులో జయరామ్ ఏకపక్ష గేమ్లను సొంతం చేసుకున్నాడు.

 

తొలి గేమ్ ను అవలీలగా గెలిచిన జయరామ్.. రెండో గేమ్లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. అయితే కీలక సమయంలో తన అనుభవాన్ని ఉపయోగించిన జయరామ్ సెమీస్లోకి దూసుకెళ్లాడు. తన కెరీర్లో వరుసగా రెండు సార్లు(2014, 15) డచ్ ఓపెన్ను గెలుచుకున్న జయరామ్.. హ్యాట్రిక్ టైటిల్ సాధించడానికి రెండు అడుగుల దూరంలో నిలిచాడు. గత రాత్రి జరిగిన మిక్స్డ్ డబుల్స్లో భారత జోడి ప్రణవ్ చెర్రీ చోప్రా-సిక్కి రెడ్డి జంట సెమీస్ కు చేరిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement