అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధం | Udhayanidhi to become a full-time politician? | Sakshi
Sakshi News home page

అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధం

Jan 25 2018 8:27 AM | Updated on Jan 25 2018 8:27 AM

Udhayanidhi to become a full-time politician? - Sakshi

తమిళసినిమా: అధిష్టానం ఆదేశిస్తే రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాను సిద్ధం అని యువ నటుడు, డీఎంకే అధినేత కరుణానిధి మనుమడు, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే.స్టాలిన్‌ కొడుకు ఉదయనిధి స్టాలిన్‌ పేర్కొన్నారు. ఈయన నటించిన తాజా చిత్రం ‘నిమిర్‌’ రేపు తెరపైకి రానుంది. ఈ సందర్భంగా ఆయన విలేరులతో మాట్లాడుతూ ఈ ఏడాది రాజకీయాల్లోకి వస్తున్న సినీతారలకు శుభాకాంక్షలు తెలిపారు. తన రాజకీయ ప్రవేశంపై మాట్లాడుతూ ఇప్పటికే డీఎంకేలోని ఓ విభాగంలో ఉన్నానన్నారు.

సినిమాల్లోకి రాకముందు పార్టీలో చురుకుగా పని చేశానన్నారు. స్టానిక థౌజండ్‌లైట్స్‌ అసెంబ్లీ స్థానానికి నాన్న (స్టాలిన్‌) పోటీ చేసినప్పుడు అక్కడ ప్రచారం చేశానన్నారు. ప్రజల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తున్నానన్నారు. రజనీకాంత్, కమలహాసన్, విశాల్‌ రాజకీయ రంగ ప్రవేశంపై తానేమీ మాట్లాడదలచుకోలేదని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement