సింహం సింగిల్‌గా వస్తే..!!

Hyenas Vs Lion Fight Guess Who Wins At The End - Sakshi

‘నాన్నా.... పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది’.... సింహం ఎంత పవర్‌ఫుల్లో చెప్పే పాపులర్‌ డైలాగ్‌. అయితే సింగిల్‌గా వస్తే సింహాన్నానైనా సరే ఓ ఆట ఆడుకుంటామని నిరూపించాయి గుంపుగా వచ్చిన హైనాలు. ఒంటరిగా ఉన్న సింహం చుట్టూ చేరి దానికి ముచ్చెటమలు పట్టించాయి. అడవికి రాజైతే కావచ్చు గానీ మా ఐకమత్యం ముందు నీ బలం పనికిరాదన్నట్టుగా సింహంతో ఓ ఆట ఆడుకున్నాయి. అయితే చివర్లో మరో సింహం వచ్చి.. తన స్నేహితుడికి అండగా నిలవడంతో హైనాలు తోక ముడవక తప్పలేదు. సవన్నా గడ్డి భూముల్లో హైనాలకు, రెండు మగ సింహాలకు మధ్య జరిగిన పోరుకు సంబంధించిన ఈ వీడియోను బీబీసీ ఎర్త్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. కాగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మరి ఇంకేం మీరు కూడా ఓ లుక్కేయండి.

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top