ఇది ప్రజావ్యతిరేక పాలన | Sakshi
Sakshi News home page

ఇది ప్రజావ్యతిరేక పాలన

Published Mon, Jan 22 2018 9:56 AM

Sabitha Indra Reddy Serious On TRS Govt - Sakshi

మొయినాబాద్‌(చేవెళ్ల): ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తోందని మాజీ హోంమంత్రి సబితారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని చిలుకూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు ఆదివారం మాజీ హోంమంత్రి సబితారెడ్డి, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు కార్తీక్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. పార్టీలో చేరినవారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలతో జనాన్ని మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు.

సీఎం కేసీఆర్‌ రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. పథకాల పేరుచెప్పి పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు రోజులు దగ్గర పడ్డాయని.. ఈక్రమంలోనే అన్ని పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరినవారిలో టీడీపీ, టీఆర్‌ఎస్, బీజేపీకి చెందిన నాయకులు శ్రీనివాస్, జలీల్, లింగంగౌడ్, నరేందర్‌రెడ్డి, సంతోష్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మహేష్, సాజిద్, ముస్తాఫా, జె.రాజేందర్, భిక్షపతి, రవి, రాజేందర్, యాదగిరి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహ్మారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బాల్‌రెడ్డి, ఎంపీటీసీ సబ్యుడు మాధవరెడ్డి, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు మక్బుల్, నాయకులు ప్రేంకుమార్, జంగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, జకరయ్య, రాములు, నాగేంద్రస్వామి, వినయ్, వడ్డె రాజు, మహేందర్, టి.రాజు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో నల్లవెల్లి గ్రామస్తుల చేరిక
ఇబ్రహీంపట్నంరూరల్‌: రాహుల్‌గాంధీ నాయకత్వం దేశానికి అనుసరనీయమని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్‌ అన్నారు. ఆదివారం యాచారం మండలం నల్లవెల్లి గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 50మంది యువకులు ఆ గ్రామ సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు సుబ్బాని ఆధ్వర్యంలో క్యామ మల్లేష్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మల్లేష్, భాష, శ్రీశైలం, శ్రీనివాస్, నాయకులు దండెం రాంరెడ్డి, శంకర్‌గౌడ్, శివకుమార్, రాంరెడ్డి, మంకాల దాసు, మల్లేష్, సిద్దంకి కృష్ణారెడ్డి, బాలశివుడు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement