‘వాళ్లకి చింత చచ్చినా పులుపు చావలేదు’ | YSRsCP MLA Jogi ramesh Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకులపై మండిపడిన జోగి రమేష్‌

Jun 15 2019 12:35 PM | Updated on Jun 15 2019 1:32 PM

YSRsCP MLA Jogi ramesh Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో పాటు ఆ పార్టీ నాయకులకు చింత చచ్చినా ఇంకా పులుపు చావలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమయినా టీడీపీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు బండారం ప్రజలకు తెలిసింది కాబట్టే టీడీపీని బొందపెట్టారన్నారు. చంద్రబాబు పాలనలో హత్యా రాజకీయాలు, కుల రాజకీయాలు అంటూ అరాచక పాలన సాగిందని జోగి రమేష్‌ మండి పడ్డారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్టీఐ, ఎంఆర్‌వో అధికారులపై దాడులు, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయన్నారు. అందుకే ఆయా వర్గాల ప్రజలు ఓటుతో చంద్రబాబుకు బుద్ధి చెప్పారన్నారు. టీడీపీ నాయకులు ట్యాక్స్‌ల పేరుతో ప్రజలను దోచుకున్నారని ఆరోపించారు. కోడెల కుమారుడు, కుమార్తె పేరు చెబితేనే గుంటూరు ప్రజలు వణికి పోతున్నారని విమర్శించారు. చద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం రాష్ట్రాన్ని వృద్ధి చేయడానికి ఏ మాత్రం పనికి రాలేదని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను అందరికి అందేలా పాలన చేస్తారని జోగి రమేష్‌ ధీమా వ్యక్తం చేశారు.

గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబును తనిఖీలు ​చేశారని కొన్ని పత్రికలు గగ్గోలు పెడుతున్నాయన్నారు. ఏబీఎన్‌ రాధకృష్ణ, ఈటీవీ రామోజీరావు పూర్తిగా తెలుసుకుని వార్తలు రాస్తే మంచిదని సూచించారు. ఏవియేషన్‌లో జడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రత చంద్రబాబుకు వర్తించదని పేర్కొన్నారు. అది కేవలం అద్వానీ, కరుణా నిధి, ప్రఫుల్ల కుమార్‌ మహంతలకే వర్తిస్తుందన్నారు. ఈ విషయంలో టీడీపీ నాయకులు అనవర రాద్ధాంతం చేస్తున్నారని జోగి రమేష్‌ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement