‘కాకిలెక్కలతో బురిడీ కొట్టించారు’ | YSRCP Whip Dadisetti Raja Slams Yanamala Ramakrishnudu | Sakshi
Sakshi News home page

కాకిలెక్కలతో బురిడీ కొట్టించారు : దాడిశెట్టి రాజా

Jul 2 2019 8:40 PM | Updated on Jul 2 2019 8:45 PM

YSRCP Whip Dadisetti Raja Slams Yanamala Ramakrishnudu - Sakshi

సాక్షి, కాకినాడ : మాజీమంత్రి యనమల రామకృష్ణుడుపై ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా విమర్శల వర్షం కురిపించారు. గడిచిన మూడేళ్లలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన సీఐఐ సదస్సుల ద్వారా లక్షకోట్ల పెట్టుబడులు వచ్చాయా అని ప్రశ్నించారు. కనీసం వెయ్యిమంది నిరుద్యోగులకైనా ఉపాధి కల్పించారా అని అన్నారు. రూ.19.16 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తామంటూ కాకిలెక్కలతో బురిడీ కొట్టించి టీడీపీ నేతలు ప్రజల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెలరోజుల పాలనాకాలంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవడాన్ని యనమల జీర్ణించుకోలేక విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఐదేళ్ల టీడీపీ పాలనతో ప్రజలు కష్టాలు, నష్టాలు తట్టుకోలేకే వైఎస్‌ జగన్‌కు పట్టం కట్టారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. వైఎస్‌ జగన్‌ ప్రజారంజక పాలన చూసి వారికి భయం పట్టుకుందని అందుకే పసలేని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. యనమల విమర్శలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement