స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ బహిరంగ లేఖ

YSRCP MLAs Writes Open letter To Speaker Kodela Siva Prasad Rao - Sakshi

సాక్షి, విజయవాడ : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ శాసన సభ్యులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనగోలు చేశారని ఆరోపించారు.

పార్టీ మారిన వారిని మంత్రులు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయంపై స్పీకర్‌ కోడెలకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. స్పీకర్‌గా ఉంటూ కోడెల టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం సిగ్గుచేటన్నారు. స్పీకర్‌ స్థానాన్ని అవమానపరిచేలా కోడెల వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే రేపు ఉదయాన్నే సభకు హాజరవుతామని పేర్కొన్నారు.

అసెంబ్లీని టీడీపీ ఆఫీసులా మార్చేశారు : గోపిరెడ్డి
అసెంబ్లీని టీడీపీ ఆఫీసులా మర్చేశారని, అలాంటి సమావేశాలనకు తాము ఎలా వెళ్లాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న శాసన సభకు మేము వెళ్లాలా అని ప్రశ్నించారు. కోడెల 22కేసుల్లో ముద్దాయి అని, అలాంటి వ్యక్తిని స్పీకర్‌ కుర్చీలో కూర్చోపెట్టడం పెద్ద తప్పని పేర్కొన్నారు.రాజ్యాంగ పదవిలో ఉండి సొంత ప్రయోజనం పొందడం తగునా, ఇది తప్పుకాదా అని ప్రశ్నించారు. ఇలాంటి స్పీకర్‌ ఉండడం దురదృష్టకరమని ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యాఖ్యానించారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top