‘హోదా కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్‌ జగన్‌’

YSRCP MLA Rajanna Dora Fires On Chandrababu Over Dharma Porata Deeksha in Delhi - Sakshi

సాక్షి, విజయనగరం : ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా పోరాడుతున్న ఏకైక వ్యక్తి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పి.రాజన్న దొర అన్నారు.  సోమవారమిక్కడ విలేరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా సంజీవని కాదన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం దొంగదీక్షలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నిలకు ముందు ఓట్ల కోసమే బాబు ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన సొంత డబ్బునో, పార్టీ డబ్బునో కాకుండా ప్రజాధనాన్ని దొంగ దీక్షలకు ఉపయోగించడమేమిటని ప్రశ్నించారు.
 
నలభై సంవత్సరాల రాజకీయ జీవితం అని చెప్పుకొంటున్న చంద్రబాబు.. నలభై సంవత్సరాల వయస్సు ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఎదుర్కోలేక ఆయన పథకాలు కాపీ కొట్టడం హాస్యాస్పదమని రాజన్న దొర ఎద్దేవా చేశారు. సర్వేల పేరిట వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులను భయాందోళనకు గురిచేసి, ప్రలోభపెట్టే కార్యక్రమంలో చంద్రబాబు మునిగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top