‘దురుద్దేశ్యంతో అవాస్తవాలు రాస్తే సహించం’ | YSRCP MLA Gudivada Amarnath Comments On Chandra babu And Pawan Kalyan | Sakshi
Sakshi News home page

‘దురుద్దేశ్యంతో అవాస్తవాలు రాస్తే సహించం’

Nov 1 2019 7:22 PM | Updated on Nov 1 2019 7:44 PM

YSRCP MLA Gudivada Amarnath Comments On Chandra babu And Pawan Kalyan - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే దురుద్దేశ్యంతో అవాస్తవాలు రాస్తే సహించేది లేదని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ హెచ్చరించారు. శుక్రవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. పత్రికా స్వేచ్ఛ భారత పౌరులందరికి వచ్చిన రాజ్యాంగ హక్కు అని.. పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు అంటూ మీడియాలో వచ్చిన కథనాలను ఖండించారు.  ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలపై కొన్ని మీడియా సంస్థలు దుష్ఫ్రచారం చేస్తున్నాయని.. అలాంటి అసత్య కథనాలపై చర్యలు తీసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. అవాస్తవాలను ప్రచారం చేస్తూ..ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలనుకునే ఏ మీడియాను న్యాయస్థానాలు గతంలో సమర్థించలేదని పేర్కొన్నారు. దేశానికి ఏపీ ఒక మార్గదర్శకంగా ఉండాలని ప్రజలకు మేలు చేసేవిధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని.. వాటిపై దుష్ఫ్రచారం చేస్తే ఖచ్చితంగా ఖండించాల్సిదేనన్నారు..

చంద్రబాబును చూసి సిగ్గుపడాలి..
సీబీఐ కేసులో వైఎస్‌ జగన్‌ వ్యక్తిగత హాజరు మినహాయింపుపై కోర్టు నిర్ణయాన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. న్యాయస్థానాలకు వెళ్లినంత మాత్రాన సిగ్గుపడాల్సిన అవసరం లేదని..కేసులను తప్పించుకుని తిరుగుతున్న చంద్రబాబును చూసి టీడీపీ సిగ్గుపడాలని ధ్వజమెత్తారు. 18 కేసుల నుండి తప్పించుకుని చంద్రబాబు ఇంట్లో కూర్చున్నారని విమర్శించారు.

జనసేనకు ఇదే లాస్ట్‌ మార్చ్‌..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇసుకపై చేపట్టే లాంగ్‌ మార్చ్‌..ఆ పార్టీకి లాస్ట్‌ మార్చ్‌ అని ఎద్దేవా చేశారు. పవన్‌కల్యాణ్‌.. లాంగ్‌మార్చ్‌కు ప్రధాన పార్టీలను కూడగడుతున్నారన్నది కొత్తగా ఉందని.. ఆల్రెడీ టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే ఉన్నాయని తెలిపారు. విశాఖ భూ కుంభకోణాలపై సిట్‌ విచారణను ప్రస్తావిస్తూ..ఫిర్యాదులు బట్టి సిట్‌ పరిధి పెంచే అవకాశముందని అమర్‌నాథ్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement