రాష్ట్రంలో రాక్షస పాలన

YSRCP Leaders AP Bandh Dharna Kurnool - Sakshi

పత్తికొండ (కర్నూలు): రాష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని వైఎస్సార్‌సీపీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి విమర్శించారు. ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్‌ పత్తికొండ నియోజకవర్గంలో విజయవంతమైంది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, జిల్లా కార్యదర్శి శ్రీరంగడు మండల కన్వీనర్‌ బజారప్పతో పాటు నాయకులు, కార్యకర్తలు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్దకు చేరుకొని బస్సులు బయటకు రాకుండా గేట్లను మూసేసి ఆందోళన చేశారు. అక్కడి నుంచి బైపాస్‌రోడ్డు వద్దకు చేరుకొని  హోసూరు క్రాస్‌ రోడ్డులో ధర్నాకు దిగారు. అనంతరం ర్యాలీగా పట్టణంలోకి వచ్చారు.

పార్టీ కార్యాలయం నుంచి హరిజన వాడ మీదగా చాక్రళ్ల రోడ్డుకు చేరుకొని అక్కడి నుంచి తేరు బజారు వెంట ర్యాలీ సాగుతుండగా ఎస్‌.ఐ.శ్రీనివాసులు ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుళ్లు కంగాటి శ్రీదేవిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజా సంఘాలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐ విక్రమ సింహ తన సిబ్బందితో అక్కడకు చేరుకొని శ్రీదేవితో పాటు నాయకులు శ్రీరంగడు, ప్రహ్లాదరెడ్డి, మురళీధర్‌రెడ్డి, జయభరత్‌రెడ్డి, రామచంద్రారెడ్డిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగడంతో పూచీకత్తుపై నాయకులను విడుదల చేశారు.

అక్రమ అరెస్ట్‌లు తగదు 
ప్రత్యేక హోదా కోసం శాంతి యుతంగా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం అక్రమంగా అరెస్టులు చేయించడం సిగ్గుచేటని కంగాటి శ్రీదేవి మండిపడ్డారు. ప్రజలను మోసం చేస్తూ వెన్నుపోటు రాజకీయాలు చేడయం చంద్రబాబును మించిన నాయకుడు రాష్ట్రంలో లేరన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆగవని, మరింత ఉధృతమవుతాయని చెప్పారు. బంద్‌లో నాయకులు జూటూరు బజారప్ప, నాగేష్, మద్దికెర మురళీధర్‌రెడ్డి, నరసింహయ్య, బనావత్‌ లక్ష్మిదేవి, గణపతి, కారుమంచప్ప, బనగాని శ్రీనివాసులు, తిప్పయ్య, కృష్ణారెడ్డి, కారం నాగరాజు, రహిమాన్, మధుసూదన్‌నాయుడు, మధు, జయ చంద్రారెడ్డి, ఇమ్రాన్, హరీష్‌రెడ్డి, నజీర్, గాంధీరెడ్డి, దాసు, భాస్కర్‌ నాయక్, మధుసూదన్‌రెడ్డి, తిమ్మరాజు, దేవన్న పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top