‘చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోవాలి’

YSRCP Leader Umma Reddy Independence day Celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశం కోసం ఎంతోమంది వీరులు ప్రాణాలు అర్పించారని, వారి చరిత్రను చూసి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందని ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. దేశ 72వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ జనాభాకు అనుగుణంగా ఆర్థిక వనరులు పెరగాలని, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలని అన్నారు.

‘మహిళలపై అత్యాచారాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కక్షలు పెరిగిపోతున్నాయి. దేశ సంపద కొంత మంది చేతిలోనే ఉండిపోతోంది. స్వాతంత్ర ఫలాలు అందరికి చేరాలి. దోపిడిలు, దుర్మార్గాలు ఎక్కువయ్యాయి. రాజకీయ వ్యవస్థకు నూతన నిర్వచనాలు ఇస్తున్నారు. పార్టీ ఫిరాయింపుల దగ్గర నుంచి అన్నీ రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. పేదలను పట్టించుకోవడం లేదు. ఆరోగ్యం, విద్యకు మహానేత వైఎస్సార్‌ చాలా ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్‌ పాదయాత్ర చారిత్రాత్మకమైనది. జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా సాగాలి. ఉభయ రాష్ట్రాలు అన్ని రంగాల్లో ముందుండాలి’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు వాసిరెడ్డి పద్మ, రెహమాన్, గట్టు శ్రీకాంత్ రెడ్డి, పుత్త ప్రతాప్ రెడ్డి, లక్ష్మీ పార్వతి తదితరులు పాల్గొన్నారు.

స్వతంత్ర  సంగ్రామంలో కృష్ణా జిల్లా కీలక భూమిక
దేశ స్వాతంత్ర్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్రం వచ్చినప్పటికీ ఆ ఫలాలు అందరికీ అందడంలేదని పార్టీ నేత పార్థసారథి అన్నారు. 72 ఏళ్లు నిండినప్పటికి ఈ పరిస్థితి ఉండడం బాధకరమని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో కృష్ణా జిల్లా, విజయవాడ కీలక భూమిక పోషించాయని, మహాత్ముని స్ఫూర్తితో వైఎస్సార్‌సీపీ ముందుకెళుతుందని మల్లాది విఘ్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీనేతలు పైలా సోమినాయుడు, బొప్పన భవన కుమార్‌, ఎమ్‌వీఆర్‌ చౌదరి, జానారెడ్డి, పుల్లారావు, పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top