వైఎస్‌ జగన్‌ 217వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ | YS Jagan Prajasankalpayatra 217th Day Scheduele Released | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ 217వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌

Jul 20 2018 9:03 PM | Updated on Jul 20 2018 9:05 PM

YS Jagan Prajasankalpayatra 217th Day Scheduele Released - Sakshi

సాక్షి, కాకినాడ: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 217వ రోజులో భాగంగా వైఎస్‌ జగన్‌ శనివారం ఉదయం కాకినాడ సిటీలోని జేఎన్‌టీయూ సెంటర్‌ వద్ద  నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నాగమల్లి తోట జంక్షన్‌, సర్పవరం జంక్షన్‌ మీదుగా ఏపీఐఐసీ కాలనీ వరకు పాదయాత్ర చేస్తారు.

అనంతరం మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. లంచ్‌ క్యాంప్‌ నుంచి మరలా పాదయాత్ర ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి ఆచంపేట జంక్షన్‌ వరకు పాదయాత్ర చేసి స్థానిక మత్స్యకారుల సమస్యలు అడిగి తెలుసుకుంటారు. అనంతరం నైట్‌ క్యాంపు శిబిరానికి చేరుకుంటారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ తలశిల రఘురాం 217వ రోజు షెడ్యూల్‌ విడుదల చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement