టీడీపీ నేతలకు వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రతి సవాల్‌ | YS Avinash Reddy accepts Pulivendula TDP Leaders challenge | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు వైఎస్‌ అవినాష్‌రెడ్డి ప్రతి సవాల్‌

Mar 1 2018 5:48 PM | Updated on Aug 10 2018 9:42 PM

YS Avinash Reddy accepts Pulivendula TDP Leaders challenge  - Sakshi

సాక్షి, కడప : పులివెందులలో టీడీపీ నేతల సవాల్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రతి సవాల్‌ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పులివెందులలో జరిగిన అభివృద్ధిని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఎప్పుడు ఏ సెంటర్‌లో చర్చకు రావాలో చెప్పాలని వైఎస్‌ అవినాష్‌ రెడ్డి సూచించారు. చేసింది చెప్పే దమ్ము తమకు ఉందని ఆయన అన్నారు. వైఎస్‌ అవినాష్‌ రెడ్డి గురువారమిక్కడ మాట్లాడుతూ... వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగిస్తున్న టీడీపీ ప్రభుత్వం సవాల్‌ విసరడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు వైఎస్‌ఆర్‌ చలవేనని అన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల్లో 80 శాతం పనులను వైఎస్‌ఆరే పూర్తి చేశారని గుర్తు చేశారు. మిగతా 20 శాతం పనులను కూడా చంద్రబాబు చేయలేకపోయారని వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌ పూర్తి చేసిన పనులకు టీడీపీ సర్కార్‌ గేట్లు ఎత్తి అదంతా తమ క్రెడిటే అని చెప్పుకోవటం సిగ్గుచేటు అన్నారు. అందుకే టీడీపీ నేతల సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, బహిరంగ చర్చకు సెంటర్‌ టీడీపీ నేతలు డిసైడ్‌ చేస్తే...తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement