ఆ రెండు బిల్లుల్ని ఆమోదించొద్దు

Yanamala Ramakrishnudu Wrote Letter to Governor - Sakshi

గవర్నర్‌కు యనమల లేఖ

సాక్షి, అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను ప్రజా ప్రయోజనాల ప్రాతిపదికగా పరిశీలించాలని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు టీడీపీ నేత యనమల రామకృష్ణుడు శుక్రవారం లేఖ రాశారు. ఈ బిల్లులను ఆమోదించవద్దని, అవసరమైతే భారత అటార్నీ జనరల్‌ అభిప్రాయాలు తీసుకోవాలని సూచించారు. గవర్నర్‌ పరిశీలించిన తర్వాత ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపాలని లేఖలో కోరారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రెండు బిల్లులు 2014లో పార్లమెంటు ఆమోదించిన చట్టానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. రాజ్యాంగం ప్రకారం.. ఒకే రాజధాని నగరం అని అర్థం ఉందన్నారు. ఈ బిల్లులను శాసన మండలి తిరస్కరించలేదని, సెలెక్ట్‌ కమిటీకి పంపిందనే విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. సెలెక్ట్‌ కమిటీ వద్ద ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని లేఖలో వివరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top