'మీ ఓట్లన్నీ ఆమ్‌ ఆద్మీ పార్టీకే వేయండి'

Vote For All AAP Candidates Says Derek OBrien In Twitter  - Sakshi

న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్‌ కాంగ్రెస్‌ మద్దతుగా నిలిచింది. ఈ ఎన్నికల్లో ఆప్‌కు ఓటు వేసి గెలిపించాలని తృణముల్‌ కాంగ్రెస్‌ ఢిల్లీ ప్రజలను కోరింది. తాజాగా తృణముల్‌ అధికార ప్రతినిధి డెరెక్‌ ఒబ్రెయిన్‌ బుధవారం ఢిల్లీలోని రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో ఆప్‌ అభ్యర్థి రాఘవ్‌ చాదాకు ఓటు వేసి గెలిపించాలని ట్విటర్‌ ద్వారా ప్రజలను కోరారు. అంతేగాక ఈ ఎన్నికల్లో ఒక్క కేజ్రీవాల్‌నే కాకుండా ఆప్‌ అభ్యర్థులందరికి ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ' ఈ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఓట్లు వేయండి.. ఆప్‌ అభ్యర్థి రాఘవ్‌ చాదానను గెలిపించండి.. అరవింద్‌ కేజ్రీవాల్‌తో సహా ఆప్‌ అభ్యర్థులందరిని గెలిపించండి' అంటూ డెరెక్‌ ఒబ్రెయిన్‌ వీడియా ద్వారా ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్న సంగతి తెలిసిందే.(‘సీఎం నివాసాన్నీ ఖాళీ చేయిస్తారు’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top