బాబోయ్‌ మాకొద్దు మీ ప్రచారం.! | Vijaya Sai Reddy Satirical Counter Tweets On Nara Lokesh | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ మాకొద్దు మీ ప్రచారం.!

Mar 29 2019 11:24 AM | Updated on Mar 29 2019 4:39 PM

Vijaya Sai Reddy Satirical Counter Tweets On Nara Lokesh - Sakshi

సాక్షి హైదరాబాద్‌ : ‘బాబోయ్‌ మాకొద్దు మీ ( చంద్రబాబు, లోకేశ్, మమతా బెనర్జీల) ప్రచారం. ఒకటి చెప్పబోయి ఇంకోటి అంటుంటే ఓటర్లు నవ్వుకుంటున్నారు. మీ దెబ్బకు ప్రచారం వదిలి జన సమీకరణ చేయాల్సి వస్తోంది’ అని తెలుగుదేశం అభ్యర్థులు వాపోతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. పార్టీ కార్యాలయ బాధ్యులకు ఫోన్లు చేసి అల్టిమేటం ఇస్తున్నారట కదా అని పేర్కొన్నారు. ‘కడుపుబ్బే కామెడీ ఉపన్యాసాలతో లోకేశ్ చులకన అవుతున్నారని కొందరు సీనియర్లు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారట.. మంగళగిరిలోనే ఉంటే మంచిదని చెప్పారట. ఏప్రిల్ 9న పోలింగు ఉంటుందని, బందరు పోర్టును ఎత్తుకుపోతారని అనడం చంద్రబాబు దృష్టికి తెచ్చినా పట్టించుకోలేదట. పుత్ర వాత్సల్యం కాబోలు!’ అని విమర్శించారు.

అబ్దుల్లా ముఖం మీదే చెప్పారట కదా! 
టీడీపీ ప్రచారంలో పాల్గొన్న ఎన్సీ నేత ఫరూఖ్ అబ్ధుల్లా గెలుపు అవకాశాలు కనిపించడం లేదని చంద్రబాబుకు ముఖం మీద చెప్పారట కదా! అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజా స్పందన లేకపోవడం, జనాలు పల్చగా ఉండటం గమనించిన అబ్దుల్లా ఐదేళ్ళు ఏం చేశారని మందలించారని, తెలుగు తమ్ముళ్లు ఓపెన్‌గానే చర్చించుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement