కేసీఆర్‌ కుటుంబానికి హత్యాపాపం: వీహెచ్‌ | vh commented over kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కుటుంబానికి హత్యాపాపం: వీహెచ్‌

Jan 29 2018 3:21 AM | Updated on Sep 19 2019 8:28 PM

vh commented over kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ కాంగ్రెస్‌నేత శ్రీనివాస్‌ను హత్య చేయించిన పాపం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసభ్యులకు తగులుతుందని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఏటా అయ్యప్పమాల వేసుకునే శ్రీనివాస్‌ గురుస్వామిగా ఉన్నారని, అతడిని చంపిం చినందుకు తగినశాస్తి జరుగుతుందన్నారు.

బీసీ నేతగా ఎదుగుతున్న అతన్ని చంపిం చిన టీఆర్‌ఎస్‌కు, కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో బీసీలు బుద్ధి చెప్తారని పేర్కొ న్నారు. 10 రోజుల్లోగా దోషులను గుర్తించడానికి డీజీపీ చర్యలు తీసుకోవాలని, లేకుం టే కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఎమ్మెల్యే వీరేశంను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement